మలేరియా డెంగ్యూ జ్వరాలు పై ప్రజలకు అవగాహన కల్పించాలి

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్

బోథ్,(ఆరోగ్యజ్యోతి):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, పారిశుద్ధ్యంపై వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. శనివారం సీజనల్ వ్యాధులు, డెంగ్యూ ,మలేరియా పై ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ జడ్పిటిసి డాక్టర్ సంధ్యారాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి యాభై డెంగ్యూ ను అందజేశారు. సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని లేని పక్షంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజాప్రతినిధులకు సూచించారు. మలేరియా డెంగ్యూ సీజనల్ వ్యాధులు పై ప్రజలకు అర్థమయ్యేరీతిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వివరించాలన్నారు. అప్పుడే ప్రజలు శానిటేషన్ పై దృష్టి సాధిస్తారని పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ కావడం వల్ల మలేరియా డెంగ్యూ ఇతర సీజనల్ వ్యాధులు వస్తాయని వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్టపల్లి వార్, మండల పరిషత్ అధ్యక్షులు తుల శ్రీనివాస్, జడ్పీటిసి డాక్టర్ సంధ్యారాణి, గ్రామ సర్పంచ్ సురేందర్, బోథ్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ , సోనల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ , హెల్త్ సూపర్వైజర్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.