సూర్యాపేట, ,(ఆరోగ్యజ్యోతి): ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ ప్రభుత్వాలు అమలు పరచక పోవడంతో దేశవ్యాప్తంగా నేషనల్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) ద్వారా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో హెచ్ఐవి విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్లు,ఫార్మాసిసిస్టులు, డేటా ఎంట్రీ. స్టాఫ్ నర్సు, కేర్ కోఆర్డినేటర్ ఉద్యోగులు 6వ రోజు వారి నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రోజువారీ డేటా ఎంట్రీ లను నిలిపివేస్తామని, నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతామని, జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి ఇళ్ళ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ మాసం నుంచి ఢిల్లీలో ప్రధాని మంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. అయితే తమ ఆందోళన వల్ల హెచ్ఐవి రోగుల ఎవరు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వర్తిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, రాజన్, నరసయ్య, లక్ష్మి, జయచంద్రారెడ్డి, మధు కాంత్, రమాదేవి, శ్రీకాంత్, నరేష్, పవన్, భాగ్యలక్ష్మి, అరుణ ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.