అమరావతి,(ఆరోగ్యజ్యోతి): 45 ఏళ్లకు
పైబడిన వారు గర్భిణీలకు ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తాడేపల్లిలోని
తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కోడి నియంత్రణ వైద్యరంగంలో నాడు నేడు పై సమీక్ష
సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 16వ తేదీన పాఠశాల పున ప్రారంభానికి సిద్ధమవుతున్న
నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలా ఇలా చూడాలని ఆయన తెలిపారు. ఈ
సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,సీఎస్
ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్,
స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్
డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి,
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్
కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్
వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్
కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి తదితరులు హాజరుఅయినారు.