ఉచిత వైద్య శిబిరానికి స్పందన

Kodam naresh ( Editor) 7013260176

కోరుట్ల,(ఆరోగ్య జ్యోతి): కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రైమరీ పాఠశాలలో  ఆదివారం నాడు లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య అధికారి డాక్టర్ ఆడెపు హర్షిత మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల పిల్లల్లో కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉచిత సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పిల్లలు జబ్బుల బారిన పడితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. వైద్య శిబిరానికి కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరు సహాయసహకారాలు అందించారు అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన నాయకులు బలిజ శివప్రసాద్, అడేపు ఆనురగ్, ఆడెపు మధు, అడెపూ వినోద్,పేట భాస్కర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.