తల్లిపాలే పిల్లలకు శ్రీరామరక్ష

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): శిశువు జన్మించగానే తల్లిపాలు ఇవ్వాలని అవి పిల్లలకు జీవితాంతం శ్రీరామరక్ష ల పనిచేస్తాయని డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథిజిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ నవ్యసుధా లు అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ట్రయల్ వెర్షన్ ఉపయోగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూ.గో వర్షాకాలం వచ్చే వ్యాధులపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరుణ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. శిశువు జన్మించిన వెంటనే తల్లి పాలు అంటే ముర్రుపాలు తాగించాలి అని అవి శిశువుకు శ్రీరామరక్షగా పనిచేస్తాయని తెలిపారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సిబ్బంది అడిగిన కొన్ని ఈ ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో వర్షాకాలం వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి వ్యాధినిరోధక టీకాలు యివ్వాలి వివిధ ఆరోగ్యం తదితర వాటిపై అవగాహన కల్పించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిసూపర్ వైజర్ లూసీ , ఫార్మసీస్ట్ రాందాస్, ఏఎన్ఎంలు సుజాత, లచుబాయి, జానా బాయి, విజయలక్ష్మి, సరస్వతి, డీఈవో వాయు కుమార్ ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.