కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
బిక్కనూరు,(ఆరోగ్యజ్యోతి): తల్లిపాలే పిల్లలకు శ్రీరామరక్ష అని జడ్పిటిసి నాగభూషణం గౌడ్ సిడిపిఓ రోచిస్మా అన్నారు. జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ దోమకొండ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బిక్కనూరు మండల కేంద్రంలో శనివారంనాడు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిల్లలకు తల్లి పాల కంటే శ్రేష్టమైనవాని , ముఖ్యంగా బిడ్డ పుట్టిన 6 నెలల వరకూ తల్లి పాలు తప్పనిసరితాగించాలన్నారు. తల్లిపాలు బిడ్డకు తాగించడం వల్ల గోవా సిటీ డయాబెటిస్ లాంటి వ్యాధులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయన్నారు. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించాలి అని ఆ తల్లిపాలు పిల్లలకు ఎంతగానో బలాన్ని అందిస్తాయి అని వారు తెలిపారు. జి. యమ్. ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జి. యమ్. ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ పౌష్ఠిక ఆహారాన్ని అందజేస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ICDS సుపర్వైజార్ శివాలక్ష్మి, ఎంపీటీసీలు సర్వస్వతి సువర్ణ ప్రభాకర్, బండి చంద్రకళ రాములు, ఆ.న.ఎం అరుణ, అంగన్వాడీ టీచర్స్ , ఫౌండేషన్ ఇంచార్జ్ శ్రీనివాస్, ప్రేమ కుమార్ , వాలింటర్ పోచాలు , గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు .