ఆడియో
టేప్ ను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బలురి గోవర్ధన్ రెడ్డి
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రిలో ఉద్యోగాల కొరకు మద్య రైతులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని టిఆర్ఎస్
పార్టీ సీనియర్ నాయకులు బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విషయనికి సంబంధించిన
ఆడియో రికార్డింగ్ తమ వద్ద ఉందని దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని
ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా కు చెందిన ముగ్గురు అమ్మాయిలకు ఆర్డర్ కాపీ
ఇచ్చేందుకు ఓ మధ్యవర్తి లక్ష నుంచి లక్షన్నర వరకు డిమాండ్ చేసినట్లు ఆయన ఈ
సందర్భంగా తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఉందని రిమ్స్ డైరెక్టర్
సూపరిండెంట్ డాక్టర్ కరుణాకర్ స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆడియో టేప్ ఆధారంగా నిర్మల్ జిల్లా ఎస్పీకి
ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గోవర్ధన్
రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో మొదటి
నుండి అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం
జరుగుతోందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక వరకు నిబంధనల ప్రకారమే అధికారులు
ప్రక్రియను పూర్తి చేశారని తెలిపినారు. అయినా మధ్యవర్తులు నిరుద్యోగులను మోసం
చేస్తూనే ఉన్నారని చెప్పారు. తాజాగా నిర్మల్ అమ్మాయిలకు డబ్బులు డిమాండ్ చేసిన
వ్యక్తిపై చర్యలు తీసుకునేలా నిర్మల్ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన
వెల్లడించారు.