పరిసరాల పరిశుభ్రత సంపూర్ణ ఆరోగ్యం

 బోథ్,(అరోగ్య జ్యోతి): పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటమని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్ ఆన్నారు. గురువారం నాడు బూత్ పరిధిలోని 4,5 వాళ్లలో ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. తలను శుభ్రం చేయాలని చెత్తాచెదారం లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్ కు వార్డు ప్రజలకు సూచించారు. చెదారం ఉండడంవల్ల మురికి నీరు నిల్వ ఉంటుందని దీని వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ అతిసారం లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామాల్లో లో చెత్త చెదారం ఉన్నట్లయితే వెంటనే గ్రామ పెద్దలకు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కాలం కావడంవల్ల పరిశుభ్రత లేకపోయినట్లయితే రకరకాల వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చర్యల్లో భాగంగా మురికి కాల్వలను శుభ్రపరచడం తోపాటు రోడ్లు ప్రధాన వీధుల్లో ఇంటి ఆవరణలో చుట్టుపక్క ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని తెలిపారు . సమావేశంలో గ్రామ సర్పంచ్ సురేందర్ యాదవ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ , ఏ ఎం ఎం లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.