కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
గట్టు,(ఆరోగ్యజ్యోతి): పుట్టిన బిడ్డకు వెంటనే
తల్లిపాలు ఇవ్వాలని అవే పిల్లలకు జీవితాంతం శ్రీరామరక్షగా పనిచేస్తాయని సిడిపిఓ
కమలాదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజాసింహా అన్నారు.
తల్లిపాల వారోత్సవాలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని
సూచించారు . డబ్బాపాలు ఇవ్వడం వల్ల పిల్లలకు రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు
ఉన్నాయని వారు పేర్కొన్నారు .ఒకవేళ తల్లికి పాలు రానట్లయితే మంచి పౌష్టికాహారం
తీసుకుంటే పాలు వస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. పోషకాహార లోపం ఉన్నట్లు అయితే
తల్లికి సరైన రావని తెలిపారు. అంగన్వాడి
సెంటర్ లో ఇచ్చే పోషకాహారం తీసు ఇవ్వాలన్నారు. తల్లిపాల పై అవగాహన లేక కొందరు
పిల్లలకు తల్లిపాలు ఇవ్వారాని , తల్లిపాలలో శిశువులకు అవసరమయ్యే పోషకలు క్యాల్షియం,
విటమిన్స్, ఐరన్ ,జింక్ తదితర పోషకాహారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్
సూపర్వైజర్లు, సూపర్వైజర్ నాగరాణి,
కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.