కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన
అదిలబాద్,(ఆరోగ్య జ్యోతి): సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థలు
ముందుండాలని ఆదిలాబాద్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. మంగళవారం
నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో మహిత స్వచ్ఛంద సంస్థ చే
వ్యాక్సిన్ పై అవగాహన ప్రచార రథాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా లో ఎక్కువ గిరిజనులు ఉన్నారని వ్యాక్సిన్పై సరైన
అవగాహన లేక మూఢనమ్మకాలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఇలా
ప్రచారం చేసినట్లు అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని
అన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలను తొలగించేందుకు ఇలాంటి ప్రచార రథాలు
అవసరమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు అర్హులైన
ప్రజలందరు ముందుకు రావాలని ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇలాంటి అనర్ధాలు జరగవు
అన్నారు. వ్యాక్సిన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో వేలాది
మంది వ్యాక్సిన్ తీసుకున్నారని ఇప్పటివరకు ఎలాంటి అనార్థాలు జరగలేదన్నారు. ఈ
కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి
డాక్టర్ నవ్యసుధా, ఎస్ ఓ బ్రమ్మానందం రెడ్డి, మాస్ మీడియా అధికారి వెంకట్
రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ సదానందం మహిత కోఆర్డినేటర్ శ్రీకాంత్,కంటే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.