కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
5న కమిషనర్ ఎదుట ధర్నా
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య
ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం
వెంటనే పరిష్కరించాలని ఈ నెల 5న ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం ఎదుట
కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్
హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.యాద నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...యన్ హెచ్ యం లోని రెండవ
ఏఎన్ఎంలు,డి యస్ సి ద్వారా నియామకమైన హెల్త్
అసిస్టెంట్ (మేల్&ఫిమేల్),యూరోపియన్ ఏ యన్ యంలు,ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిష్ట్ లు,స్టాప్ నర్సులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లలోని ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, స్టాఫ్ నర్సులు,
మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ లు,
అకౌంటెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్వీపర్లు,
వాచ్ మెన్స్, కార్యాలయాల్లో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ లు ప్రోగ్రాం అధికారులు
వైద్య విధాన పరిషత్,డి యం ఈ పరిధిలో పనిచేస్తున్న 104 ఉద్యోగులు, నేచురోపతి ఐపీయం లోని ఉద్యోగులు,
ఆయుష్, టీ సాక్స్,ఆర్ బి ఎస్ కె,బ్లడ్ బ్యాంక్, యన్ టి ఈ పి, యన్ సి డి,ఆరోగ్యశ్రీ,హెచ్ఆర్డి ఎ యన్ యంలు, యస్ యన్ సియు,సీమాంక్,యన్ ఆర్ సి, డైక్ తదితర విభాగాల్లోని యన్ హెచ్ యం ఉద్యోగులు, కంటింజెన్సీవర్కర్స్,ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మరియు ఇతర
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరు గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, వీరికి ప్రభుత్వం కనీస వేతనాలు, ఉద్యోగ భధ్రత ఇతర చట్టబద్ధ హక్కులు అమలు అమలు చేయకుండా
నిర్లక్ష్యానికి గురి చేయడం సమంజసం కాదన్నారు, గత 17 నెలలుగా కరోనా మహమ్మారి తో సహవాసం
చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తుంటే కనీసం తెలంగాణ తోలి పి ఆర్ సి
ని అమలు చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తెలంగాణ తొలి పీఆర్సీ ప్రకారం వేతనాలు
పెంచి రెగ్యులర్ చేయాలని,పెండింగ్ లో ఉన్న 5నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని,కరోనా కాలంలో పనిచేసి తోలగించబడిన 1640 మంది స్టాప్ నర్సులను యధావిధిగా తిరిగి విధులకు తీసుకోవాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైద్య ఆరోగ్యశాఖలోని నేషనల్ హెల్త్
మిషన్ లో పనిచేస్తున్న రెండవ ఎ యన్ యంలు,డి యస్ సి
కాంట్రాక్టు ఉద్యోగులు,అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో
పనిచేస్తున్న ఉద్యోగులు,ఇతర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ తెలంగాణ తొలి పీఆర్సీ ప్రకారం వేతనాలు
పెంచి, రెగ్యులర్ చేయాలని,5నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కరోనా కాలంలో పనిచేసి తోలగించబడిన1640 మంది స్టాప్ నర్సులను యధావిధిగా తిరిగి విధులకు తీసుకోవాలని డిమాండ్.ఈ సమస్యల పరిష్కారం కోసం 2021 ఆగస్టు 5 గురువారం రోజున ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్
కార్యాలయం ముందు జరిగే ధర్నాలో
రాష్ట్రంలోని ఉద్యోగులందరు తప్పకుండా హజరు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ K.బలరాం,MD ఫసి యోధ్ధీన్,A.కవిత, V.మరియ,S.హరి శంకర్,ప్రవిణ్ రెడ్డి, V.విజయవర్దన్ రాజు,J.సుధాకర్, K.వీరయ్య, సంజుజార్జ్, వేణుగోపాల్, J.ఏడు కోండల్, విజయలక్ష్మి, సరోజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.