ఎయిడ్స్ నియంత్రణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)



ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఎయిడ్స్ విభాగంలో గత కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న ఎయిడ్స్ నియంత్రణ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్  కు వినతి పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎయిడ్స్ నియంత్రణ కొరకు ఎంతో పాటు పడ్డారు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు 30 శాతం పిఆర్సి పెంచారని అదే విధంగా ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న వారందరికీ 30 శాతం అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఎయిడ్స్ నియంత్రణ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు . ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్ నాయక్, ఎస్ కె మీరాజ్ హాలీ, నరోత్తం రెడ్డి , అయూబ్ ఖాన్, సూర్యనారాయణ, ఎస్ కె ఆవన్ తదితరులు పాల్గొన్నారు.