రామ్ నగర్ లో ఘనంగా బోనాల పండుగ

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో ఆదివారం నాడు ఘనంగా బోనాల పండుగను కాలనీవాసులు నిర్వహించారు. బాజా భజంత్రీల మధ్య ప్రధాన కూడళ్లు తిరుగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. రాంనగర్ నిర్వహించిన బోనాల ఉత్సవాలు పండగ వాతావరణాన్ని కల్పించాయి బోనాల ఉత్సవాల్లో భాగంగా కాలనీ మొత్తం భక్తి పారవశ్యం అయిపోయింది. ఆనవాయితీగా వస్తున్న బోనాల పండుగ రాంనగర్ లో ఒకేసారి కాలనీవాసులు బోనాలు వేయడం మొదటిసారి. బోనాలు వేయడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని, సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగడంతో పాటు  ఇతర బాధలు ఉండవు అని పెద్దలు చెబుతారు. ఈ బోనాల వేయడం వల్ల అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు ఆలయ కమిటీ సభ్యులు. కాలనీవాసులు ఒకేసారి బోనాలు వేయడం , సంతోషకరం మైన విషయమని ఆలయ కమిటీ సభ్యులు ఏలేటి బీం సేన్  రెడ్డి తెలిపారు. వచ్చే సంవత్సరం బోనాల పండుగను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బోనాల కార్యక్రమంలో రాధాకృష్ణారెడ్డి ,మారిశెట్టి రవి, విక్రమ్, శేఖర్, శంకర్, దేవన్న, ప్రతాప్ రెడ్డి లతో పాటు రజిత రెడ్డి ,స్వరూప ,ప్రమీల, నాగమణి ,సుశీల ,పుష్పలత, భారతి ,నాగమ్మ అనసూయ, ప్రియ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.