ఆరోగ్య సాథిలో టీబి వివరాలు

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

   ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): దేశవ్యాప్తంగా టీబిని నిర్మూలించడానికి జాతీయ నిర్మూలన కార్యక్రమం లో భాగంగా “ఆరోగ్య సాథి” అనే  యుప్ ని  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనీ జిల్లా టీబి నిర్మూలన అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్  తెలిపారు. 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో టిబి నిర్ములించలానే ఉద్దేశంతో ఈ యాప్ ను ప్రవేశపెట్టిందనీ అన్నారు. ఈ యాప్ లో టీబి సంబంధించిన సేవలు, అధికారుల వివరాలు, టీబి లక్షణాలు, టీబి కి  సంబంధించిన సందేహాలు పౌష్టికాహారం వివరణ తో పాటు అన్ని రకాల సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. టీబి కి సంబంధించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారుల వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. టీబికి సంబంధించిన లక్షణాలు కనిపించినట్లయితే ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి పరీక్ష ద్వారా వాటి వివరాలు నమోదు చేసుకొని సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షలు మరియు ఉచిత చికిత్స అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ యాప్ ను వినియోగించాలని తెలిపారు ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది, ఆశ, రోగులు వారికి సంబంధించిన స్నేహితులు టీబి గురించి అని తెలుసుకోవాలి అనే సందేహం ఉన్నవారు కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.