కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
పైపాడు, (ఆరోగ్యజ్యోతి): పైపాడు గ్రామం లోని ఉప ఆరోగ్య కేంద్రాన్ని
మున్సిపల్ చైర్మన్ కరుణా సూరి శనివారం నాడు సందర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న
సేవలను అడిగి తెలుసుకున్నారు. బీపీ షుగర్ టెస్ట్ లు చేసిన రికార్డులను ఆమె
పరిశీలించారు. రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు ఎలా ఇస్తున్నారు సలహాలు
సూచనలు ఇస్తున్నారా లేదా అనే దానిపై ఆమె ఆరా తీశారు. ఆసుపత్రి కి వచ్చే రోగులకు
సరైన వైద్య సేవలు అందించాలని ఆమె ఆదేశించారు వర్షాకాలం కావడం వల్ల దోమలు ఈగలు
నుండి వచ్చే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.