గర్భవతులకు అన్ని వైద్య పరీక్షలు చేయాలి

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ కె సుధాకర్ లాల్

నాగర్ కర్నూల్, (ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రికి వచ్చే గర్భవతులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ అన్నారు. శనివారం నాడు ఆశ నోడల్ అధికారులకు ఆరోగ్య కార్యకర్తలకు వై ఇతర వైద్య సిబ్బందికి మాతాశిశు సంరక్షణ సేవలు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమయం లో అందించే సేవల అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలను  గుర్తించిన తర్వాత  12 వారాల్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పేరు నమోదు చేసుకుని 120 రోజుల పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించాలన్నారు. రక్తహీనత యొక్క జాబితాను తయారుచేయాలని తెలిపారు. పోషకాహార లోపం గుర్తించి వెంటనే వైద్య అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. క్రమం తప్పకుండా గర్భిణీలకు నెల నెల వైద్య పరీక్షలు చేయాలని తెలిపారు. టిటి ఇంజక్షన్ కూడా ఇవ్వాలని తెలిపారు .గర్భిణీలకు టోల్ ఫ్రీ నెంబర్ 180059912345 ద్వారా గైనకాలజిస్ట్ వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ అయినట్లయితే నే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కెసిఆర్ కిట్టు తో పాటు నగదు కూడా అందుతుందని తెలిపారు .అందుకు గర్భిణీ యొక్క రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని తెలిపారు.