మెడికల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

హైద్రాబాద్ (ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నర్సింగ్, పారామెడికల్, వార్డ్ స్టాఫ్, ఆరోగ్యశ్రీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ కు పీఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ సిబ్బంది  బేసిక్ వేతనం చెల్లించాలని, ఔట్సోర్సింగ్  సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,  ఈఎస్ఐ, ఎంఎన్.జే ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ రాష్ట్ర మెడికల్  ఔట్సోర్సింగ్ యూనియన్ నిర్ణయం మేరకు బుదవారం  ఉదయం 10  గంటలకు ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ మెడికల్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్   యూనియన్ AITUC రాష్ట్ర అధ్యక్షులు ఎం.నర్సింహా తెలిపినారు.ఆస్పత్రుల్లో పనిచేయుచున్నా  పై క్యాటగిరీల సిబ్బంది అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరినారు.