ప్రణాళిక సంఘం చైర్మన్ ను కలిసిన ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం నేతలు

 సమాన పనికి సమాన వేతనం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి..

తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్ 1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి...

హైదరాబాద్, (అరోగ్య జ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు  కాంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు శనివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్ ను తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్ 1 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాయి రెడ్డి, టిఆర్ఎస్ కెవి  నాయకులు రూప్ సింగ్  ఆధ్వర్యంలోని  బృందం శనివారం ఆయన నివాసంలో కలిసి సమస్యలు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా చూడాలని కోరడం జరిగిందన్నారు .ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఎం  లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంప్లాయిస్ కి పిఆర్సి వర్తింపజేయాలని, కాంట్రాక్టర్లకు హెల్త్ అసిస్టెంట్ లకు, యూరోపియన్  స్కీం ఏ ఎన్ ఎం, సెకండ్ ఏ ఎన్ ఎం లకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరారు. అలాగే  ఆశా వర్కర్లకు మినిమం స్కీల్ ఇస్తూ పిక్స్ శాలరీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివిధ  పి హెచ్ సి లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ పిఆర్సి అమలయ్యేలా చూడాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కంటిజంట్  వర్కర్ లందరికీ,అలాగే,104,108,102 సర్వీసెస్ లో పనిచేస్తున్న సిబ్బంది కూడా పిఆర్సి వర్తించేలా చూడాలని కోరడం జరిగిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న మరోసారి సమావేశం కానున్నట్లు సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఉస్మానియా హాస్పిటల్ యూనియన్ కార్యదర్శి రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు