ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): కరోనా నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కోవేట్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవీందర్ అన్నారు శుక్రవారం నాడు ఉప్పల గుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కోహ్లీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు కరోనా రాకుండా ఉండాలంటే సామాజిక దూరం తో పాటు మాస్కు ధరించాలి అన్నారు అలాగే ప్రతి అరగంటకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని సూచించారు. జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనా దరిచేరదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీ దేవి  , డేటా ఎంట్రీ ఆపరేటర్ సాజి , మెడికల్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా ఎ.ఎన్.ఎం.లు నాగలక్ష్మి , ఉమా , ఆశ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.