అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి):అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రవీందర్, డాక్టర్ శ్రీదేవి లు అన్నారు. చింతల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపోహలను తొలగించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.  వ్యాక్సిన్ . తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెరుగుతుందని సూచించారు. కరోన వచ్చే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపెర్వైసేర్ తేజావత్ రవీందర్ సి.ఓ. డీ మోహన్ రావు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా, డేటా ఎంట్రీ ఆపరేటర్ సజీ, ఫార్మసిస్ట్ జోషేణ, స్టాఫ్ నర్స్ రుబీనా అజమ్మీ, ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య , ఎ.ఎన్.ఎం.లు ఉమా, నాగలక్ష్మి , ఉప్పలమ్మ , ప్రేమలత,పెనిన్నా , శ్రీలత . ఆశ కార్యకర్తలు శోభ తదితరులు పాల్గొన్నారు.