అవుట్సోర్సింగ్ నర్స్ ఆత్మహత్య యత్నం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

మహబూబ్ నగర్,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వం కోవిడ్ వీధుల్లో తీసుకున్న స్టాఫ్ నర్స్ అను తొలగించారని దీంతో స్టాఫ్ నర్స్ సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కరోన సమయంలో 1640 మంది స్టాఫ్ నర్స్ లను   అవుట్సోర్సింగ్ కింద ఎంపిక చేసింది. ఏడాది పూర్తయిన తర్వాత వీరందరి తొలగించారు .దీంతో మనస్థాపానికి గురైన సుజాత దాదాపు  250 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ప్రభుత్వం ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. ఆత్మహత్యకు  పాల్పడ్డ స్టాఫ్ నర్స్ సుజాత మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాదిపాటు పని చేసింది ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం లేదని మనస్తాపానికి గురైన సుజాత ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.