కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
- జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
ప్రసూతి పై ప్రతి ఒక్కరు శ్రద్ధ పెట్టాలని ఆసుపత్రిలో ప్రసూతి అయ్యే విధంగా
చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ సూచించారు. యూనివర్సల్
బర్త్ డిఫెక్ట్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో శుక్రవారం ఆర్
బి ఎస్ కే అధికారులు సిబ్బందికి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్ బి
ఎస్ కే అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి అయిన వెంటనే బిడ్డను
అన్నిరకాలుగా పరిక్షిన్చాలన్నారు.బిడ్డ ఆరోగ్య పరిస్థితి కనిపెట్టి అవసరమైతే తక్షణ
చికిత్స ప్రారంభించాలని సూచించారు. పుట్టిన శిశువుకు ఏదైనా లోపాలు ఉన్నట్లయితే
వెంటనే చికిత్స అందించాలని తెలిపారు. పుట్టిన వెంటనే పిల్లలకు ముర్ర పాలు
తప్పకుండా పాటించాలని తెలిపారు ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు
నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలాగే ఆగస్టు నెలలో నులిపురుగులు
మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు .పాఠశాలలు మూసి ఉండటంవల్ల ఆరోగ్య కార్యకర్తలు
ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నులిపురుగులు మాత్రలు వేయడం జరుగుతుందని
తెలిపారు. ఆర్ బి ఎస్ కె అధికారులకు సిబ్బందికి యాప్ తో పాటు ఆర్ బి ఎస్ కే
ఆధ్వర్యంలో ప్రచురించిన బుక్స్ పై శిక్షణ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె
ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ సారథి, శ్రీనివాస్ ఎం ఆర్ సి వైద్యాధికారి డాక్టర్
శ్రావ్య వాణి, ఈశ్వర్ రాజ్ ,మేనేజర్ జై వినోద్ నాయక్ వైద్య అధికారి డాక్టర్ రాధిక ,గోపాల్
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.