పీజీ సీట్ల కొరకు రిమ్స్ ను పరిశిలించిన ఎంసీఏ

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కళాశాలలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) మంగళవారంనాడు పరిశీలించింది. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ  సీట్ల కొరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి దరఖాస్తు చేసుకుంది . ఇందులో భాగంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుండి డాక్టర్ మంజు బెనర్జీ ఆసుపత్రి , కళాశాలను ఆమె పరిశీలించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ(సర్జరీ) సిట్ల కోసం  రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కళాశాలను ఆమె పరిశీలించారు.అనంతరం డైరెక్టర్ చాంబర్లో సర్జరీ కి సంబంధించిన ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ ,అసోసియేట్ ప్రొఫెసర్ట్యూటర్ కు సంబంధించిన అన్ని రకాల పత్రాలను ఆమె పరిశీలించారు.ఆదిలాబాద్ రిమ్స్ కు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల మంజూరు కోసం అన్ని రకాల వసతులుఆస్పత్రి కళాశాలతో పాటు బోధన సిబ్బంది ఇతర సిబ్బంది సౌకర్యాల గురించి ఆమె ఆరా తీశారు.ఆసుపత్రి,కళాశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో, పీజీ విద్యార్థులకు సరిపోతాయా దానిపై  పరిశీలించారు. ఆమె వెంట రిమ్స్ డైరెక్టర్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్  బలిరాం నాయక్ తదితరులు ఉన్నారు.