వేతనం పెంచాలని డిఎం ఈ కి వినతి పత్రం

       కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): ప్రభుత్వాసుపత్రుల్లో గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్నటువంటి శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ దాడులకు పదకొండవ పిఆర్సి లో వేతనం పెంచలేదని వెంటనే వీరికి వేతనాలు పెంచాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డి యం ఈ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుప్, ప్రధాన కార్యదర్శి నరసింహ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 ప్రకారం కనీస వేతనం 19000 ఇవ్వలని ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు పని చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పిఆర్సి తో పాటు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21 లో పేర్కొన్న ప్రకారం జాతీయ. ఆర్జిత సెలవులు అమలుచేయాలని నైట్ అలవెన్సులు ఇవ్వాలని వారు కోరారు. వైద్యరంగం పై రాబోవు రోజుల్లో పని భారం పెరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు . బెడ్ ల  సంఖ్యకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అసీనా బేగం, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీబాయి, నగర కార్యదర్శి కె యాదగిరి, సర్వే ష్, ఎస్ కిష్టమ్మ కృష్ణవేణి మదన్ సింగ్ పుష్పలత స్వరూప తదితరులు పాల్గొన్నారు.