కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
పాథాలజీ విభాగం
పీజీ సీట్లపై పరిశీలన
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల
ఆసుపత్రి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ బృందం
బుదవారం పరిశీలించింది. రిమ్స్ కళాశాల లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ సీట్ల మంజూరు
కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్
ఇండియా రిమ్స్ పరిశీలన కొరకు హర్యానాలోని
రోతక్ జిల్లాకు చెందిన
డాక్టర్ కౌర్ పరిశీలించారు. ఆసుపత్రి లోని పాథలోజి డిపార్ట్మెంట్ ల్యాబ్ పరిశీలించారు. ల్యాబ్ లో
పరీక్షలు ఏ విధంగా ఇస్తున్నారు అనే దానిపై ఆరా తీశారు. రిమ్స్ కళాశాల లోని లైబ్రరీ
క్లాస్ రూమ్ లో తదితర వాటిని ఆమె పరిశీలించారు. రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్లకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించారు వారి
అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాం
నాయక్, పాథలోజి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్యులు
తదితరులు ఉన్నారు.