కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
కమిషనర్
కి పారామెడికల్ సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఎంప్లాయిస్ తో పాటు సమాన వేతనాలు అందించాలని
వీటితో పాటు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పదకొండవ పిఆర్సి ప్రకటించిన విధంగాఅమలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణకి మంగళవారం నాడు పార మెడికల్ సంఘాల ఐక్యవేదిక
ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ల నాయకులు లు
భూపాల్, కే సాయి రెడ్డి, కె యాద నాయ,క్ కొండా పురుషోత్తం రెడ్డి, నాగరాజు ,పి
విజయలక్ష్మి, బి మరియమ్మ ,కవిత, విజయవర్ధన్ రాజు ,సంజీవ రాజు, శ్రీనివాస్, రమణ,
కిషన్ ,విజయ్ బాబు, కుమారస్వామి, మీనా, లక్ష్మీపతి, హేమలత, లలిత తదితరులు
మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్య సిబ్బందిని
ప్రభుత్వం మర్చిపోయింది అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్న
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ప్రకారం సమాన
పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. రెండవ ఏఎన్ఎం, ఈసి ఏఎన్ఎన్, హెచ్ ఆర్ డి ఏఎన్ఎం, యుపిహెచ్సి ఏఎన్ఎం, ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్
తదితర సిబ్బంది అందరికీ సమాన పని సమాన వేతనం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పర మెడికల్ ఉద్యోగులందరికీ సర్వీసు క్రమబద్ధీకరించాలి
అన్నారు .జీవో నెంబర్ 19 ప్రకారం హైకోర్టులో ఉన్న
కేసును పరిష్కరించి పర్మిట్ చేయాలని వారు కోరారు. టిఎస్పిఎస్సి ఏఎన్ఎంలు ,ఫార్మసిస్ట్
,ల్యాబ్ టెక్నీషియన్లు ,రేడియో గ్రాఫర్లు తదితర ఉద్యోగులందరినీ కౌన్సిలింగ్ పిలిచి
అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2017 సంవత్సరంలో వివిధ అ
పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చారని ఇటీవల స్టాఫ్ నర్స్ పోస్టులు మాత్రమే
ఇంటర్వ్యూలు నిర్వహించి అపార్ట్మెంట్ చేశారని మిగిలిన పారామెడికల్ పోస్టులను కూడా వెంటనే
భర్తీ చేయాలన్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పనిచేస్తున్న వారికి గతంలో జీవో
నెంబర్ 510 ద్వారా 12 వేల మంది ఉద్యోగుల లో కేవలం
ఎనిమిది వేల మందికి మాత్రమే అమలు చేశారని నాలుగు వేల మందికి ఇంతవరకు అమలు కాలేదు
అన్నారు. కాంట్రాక్ట్ పర మెడికల్
ఎంప్లాయిస్ హాస్పిటల్స్ వర్కర్స్ అయినా ఒక 104,108,102. టి స్నాక్స్ 24 గంటల ఆస్పటల్స్, ఎన్ టి ఈ పి, ఎం సి డి ఉద్యోగులు, ఆర్ బి ఎస్ కె, ఆరోగ్యశ్రీ శ్రీ బ్లడ్
బ్యాంక్ నేచురోపతి ఐ పీ ఎమ్ ఆయుష్ విభాగాలతో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కార్యాలయంలో
పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 63 అందరికీ రెగ్యులర్
ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నేషనల్ హెల్త్ మిషన్
ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2018లో ఉద్యోగులకు వేతనాలు
పెంచుతూ జారీ చేసిన జీవోనెంబర్ 510 నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ వర్తింప
చేయాలని వారు కోరినారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మందికి పైగా ఆశా
కార్యకర్తలు సేవలందిస్తున్నారు వీరికి తో పాటు పెంచిన 30 శాతం పిఆర్సి వర్తింపజేయాలని
డిమాండ్ చేసినారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల పై
పని భారాన్ని తగ్గించాలని కోవిడ్ లో పనిచేసిన ప్రతి ఉద్యోగి స్పెషల్
ఇన్స్టిట్యూట్ మంజూరు చేయాలన్నారు.విధి నిర్వహణలో చనిపోయిన వారందరికీ ప్రభుత్వం
తరఫున కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు కోరినారు.