ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచండి

 

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది కి వేతనాలు పెంచాలని  తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు  రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి యాద నాయాక్, సబ్యులు బైరాపక శ్రీనివాస్ లు  అన్నారు.అనంతరం డి ఎం ఈ డాక్టర్ రమేష్ రెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 మార్చి నుంచి కోవిడ్ రోగులకు సర్వీస్ అందిస్తున్న వీరికి  ఇంతవరకు వేతనాలు పెంచాలేదన్నారు. మూడు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వారు తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల కోసం కార్మిక శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 68 ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ జీవో కాలపరిమితి 5 సంవత్సరాలు ముగిసిన, అనంతరం జీవో నెంబర్ 306 లేబర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిందని గుర్తు చేశారు . ఈ జిఒ  ప్రకారం 16 వేల రూపాయల వేతనం ఇవ్వాలని తెలిపారు .