పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయండి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమిటులైన కారం రవిందర్ రెడ్డిని  ఐక్య వేదిక తరపున మంగళవారం సన్మానించారు. 2017 లో వెలువరించిన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ మరియు తదితర పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయలని ఐక్య వేదిక ప్రతినిధులు డా.రవిశంకర్, డా.షరీఫ్, ఆర్.సుజాత, మంచాల రవిందర్, వీరారెడ్డి, నవీన్, శైలజ, కుమారస్వామి, ఎ.సుజాత, మంజుల, క్రిష్ణ, స్వాతిలు  కోరినారు.కోర్టు కేసుల పరిష్కారానికై ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని, స్టాఫ్ నర్సుల సమస్యను పరిష్కరించి విధంగానే  మిగతా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ ఏఎన్ యం  తదితర పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయలని వారు కోరినారు.సమస్యలను వివరిస్తూ అన్ని కేసుల పరిష్కారానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తీవ్రంగా కృషి చేస్తూ ఉందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవిందర్ రెడ్డి తెలిపినారు.  త్వరలోనే అన్ని నియామకాలు పూర్తవుతాయని తెలిపారు. త్వరలోనే పైన తెలిపిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.