ఐక్యతతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

వైద్య ,ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ హెచ్ 1 యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి అన్నారు. యూనియన్ రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశాన్ని బుధవారం కోఠి లోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయి రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా యూనియన్ పని చేస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ పిఆర్సి వర్తించేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఐక్యత ఉంటే ఉద్యోగుల హక్కులు  సాధ్యమవుతాయని తెలిపారు. యూనియన్ బలోపేతానికి జిల్లాల వారీగా కమిటీ లు వేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జోన్ల వారీగా బాధ్యతలు తీసుకొని యూనియన్ బలోపేతానికి సహకరించాలని కోరారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాధి ని అడ్డుకునేందుకు వైద్యారోగ్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని ప్రభుత్వం గుర్తించిందని  అన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ  సందర్భంగా యూనియన్ పలు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తంరెడ్డి , వివిధ జిల్లాల నాయకులు ,రవిచందర్, యాదగిరి,రాములు,మహేందర్, రాజు,సత్యనారాయణ, చౌరి ,నాగరాజు,హనుమంత రెడ్డి, సువర్ణ ,హేమ ,పద్మ తదితరులు పాల్గొన్నారు.