క్షయ వ్యాధిపై ప్రజలకు అవగహన కల్పించాలి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

భీంపూర్,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): క్షయ వ్యాధిపై ప్రజలకు  అవగహన కల్పించాలి  జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్ అన్నారు. మంగళవారం నాడు భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు హెల్త్ అసిస్టెంట్ లకు పారామెడికల్ సిబ్బంది ఆశా కార్యకర్తలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడం కోసంఅందరు కృషి చేయాలనీ తెలిపినారు. ఆదిలాబాద్ జిల్లా ఏడవ స్థానంలో ఉందని దీన్ని మొదటి స్థానానికి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.  ఈ వ్యాధి వచ్చిందని ఎవరు బయ పడాల్సిన అవసరం లేదని  మల్టీ డ్రగ్ థెరపీ చికిత్సల ద్వారా వ్యాధిని తక్కువ టైం తగ్గించవచ్చని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు హౌస్ విజిట్ చేసే సమయంలో  వ్యాధి ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయ ఆవరణలో గల ఆసుపత్రి కి రోగులను తీసుకువచ్చి టెస్టులు చేయించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. క్షయ వ్యాధి వచ్చిందంటే చాలామంది భయభ్రాంతులకు గురి అవుతారని అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదని తెలిపారు .దగ్గు జ్వరం బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే క్షయవ్యాది పరిక్ష చేయించాలని తెలిపారు. ఆశ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు హౌస్ విజిట్ చేసే సమయంలో కానీ లేదా ఇతర సమయాల్లో కానీ అనుమానిత కేసులు గుర్తించి వెంటనే క్షయవ్యాది పరిక్ష చేయాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవ్య సుధ, డి ఐ ఓ డాక్టర్ విజయసారధి, కీటక జనీత వ్యాధులు అధికారి డాక్టర్ యం శ్రీధర్, దీర్ఘకాలిక వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ డా క్రాంతి కుమార్ ,డాక్టర్ భారత్ పవార్, క్షయ వ్యాధి అధికారి నవీద్, పర్యవేక్షకులు లూసీ, గంగాధర్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.