ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి

 

వరంగల్ అర్బన్,(ఆరోగ్య జ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిల్ వ్యాక్సిన్ తీసుకోవాలని చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ ఎస్ రవీందర్ అన్నారు. బుధవారం నాడు చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిద్ వ్యాక్సిన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా ఆయన మాట్లాడుతూ దశలవారీగా ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ డీ. మోహన్ రావు , మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్ , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , డేటా ఎంట్రీ ఆపరేటర్ సాజి , స్టాఫ్ నర్స్ సాయి వీణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 146 మందికి వాక్సిన్ వేశారు.