ఆరోగ్య జ్యోతి “వార్తకు” స్పందన

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

గిమ్మ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందికి మెమోలు జారీ

జైనథ్,ఆదిలాబాద్,(ఆరోగ్య జ్యోతి): సమయానికి రాని గిమ్మ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అని జూన్ 19న ఆరోగ్య జ్యోతి దిన పత్రికలో ప్రచురితమైన “వార్తకు”  స్పందన లభించింది. విధులకు సరైన సమయానికి హాజరు కాని వైద్య సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నిర్మల సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లకు వైద్య అధికారిని మెమోలు జారీ చేశారు. విధులకు సరైన సమయానికి రాకపోవడం వల్లనే మెమోలు జారీ చేసి చేసినట్లు తెలిపారు. సబ్ సెంటర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని  సిబ్బంది విధులు సరైన సమయానికి హాజరు కావాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైద్యాధికారి తెలిపారు. రోగులకు సేవలందించడంలో సిబ్బంది ముందు ఉండాలని తెలిపినారు.