రిమ్స్ స్టాఫ్ నర్స్ ల సరెండర్

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లో పనిచేస్తున్న ఇద్దరు స్టాఫ్ నర్స్ తో పాటు ఒక ఇన్చార్జ్ నర్సింగ్  సుపరెందేంట్ సరెండర్ చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ మరియు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ బలరాం నాయక్ తెలిపారు. ఈనెల 13న మేల్ మెడికల్ వార్డులో ఎక్స్పరి అయిన మందులు ఇచ్చారని ఒక రోగి ఫిర్యాదు చేశారు .దీనిపైపూర్తి విచారణ చేసిన అనంతరం సరెండర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నర్సింగ్ ఇంచార్జ్ సూపరిండెంట్ ను న్యూ డిహెచ్ కి  సరెండర్ చేయగా,ఒక కాంట్రాక్ట్  స్టాఫ్ నర్స్ ని  సొసైటీకి, మరొక స్టాఫ్ నర్స్ ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి సరెండర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.