ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):జర్నలిస్టుల
వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదిలాబాద్, నిర్మల్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సాఫీగా జరిగింది.
మొత్తం 22 కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు స్వచ్ఛందంగా
వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆదిలాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ లో జర్నలిస్టుల
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా
ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పెల్లి వార్, డి పి ఆర్ ఓ
భీమ్ కుమార్, ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ రెండు
రోజులపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్దేశించిన కేంద్రాల్లో జర్నలిస్టులు
స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, రెండో విడత
వ్యాక్సిన్ను 84 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇదివరకే వ్యాక్సిన్
తీసుకున్న జర్నలిస్టు మిత్రులు తప్పనిసరిగా సంబంధిత కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లో
నమోదు చేయించుకోవాలని బేతా రమేష్ కోరారు. కాగా జర్నలిస్టు సంఘం ప్రాతినిధ్యం మేరకు
త్వరలోనే అక్రిడేషన్ లేకుండా ఎంపానెల్
మెంట్ కలిగి ఉన్న పత్రికలు చానళ్ల రిపోర్టర్లకు సైతం వాక్సిన్ వేసేందుకు సంబంధిత అధికారులు
అంగీకరించడం పట్ల యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో టి యూ డబ్ల్యూజె
ప్రధాన కార్యదర్శి ఎల్ రాజు, జిల్లా
నాయకులు శానం ప్రవీణ్, అన్వర్, సందేశ్, విట్టల్, తదితరులు
పాల్గొన్నారు.