- సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద
రెడ్డి..
కరీంనగర్,(ఆరోగ్యజ్యోతి): సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ కె.వేణుగోపాల్ రావు గారి స్మారకంగా కేంద్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో కరోన వచ్చి ప్రజలను అతల కుతలం చేస్తున్నదాని, అనేక మంది దీని బరిని చనిపోతున్నారని, ఇదే అదునుగా ప్రయివేట్ ఆసుపత్రులు అడ్డగాలుగా దోచుకోవడంతో ప్రజలు ఆర్థికంగా కుంగిపోతున్నారని తెలిపారు. ఈ నేపత్యంలో కరోన బరిని పడి ఇంటివద్దనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి సీపీఎం ఆధ్వర్యంలో భోజన సరఫరా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ పట్టణంలో భోజనం వండుకోలేని పరిస్థితి ఉన్నవారికి డైరెక్టుగా భోజనం హోమ్ డీలువరి చేయబడును అని తెలిపారు. మంచి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. కె.వసుధ వేణుగోపాల్ రావు కి 25వేలు ఆర్థిక సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు U. శ్రీనువాష్, బండారి శేఖర్, రజినీకాంత్, lic యూనియన్ నాయకులు రమణ, రాజేందర్, వమాన్ రావు, అనుపమా, సీపీఎం నాయకులు సురేష్, శ్రీకాంత్, సాగర్ తడితరులు పాల్గొన్నారు.
భోజనం కావాల్సిన వారు మద్యాహ్నంనికి ఉదయం 9am లోపు , సాయంత్రం కావాల్సిన వారు 4pm లోపు ఆర్డర్ ఇవ్వాలని తెలిపారు ...
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబర్ లు
బండారి శేఖర్- 9652228294, గుడికందుల సత్యం- 9849232515. U. శ్రీనువాష్- 9866570130,రజినీకాంత్ -8106052553