అమలాపురంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభించిన మంత్రి విశ్వరూప్

తూర్పుగోదావరి,ఆరోగ్యజ్యోతి:శరీరానికి రక్తం ఎంత ముఖ్యమో ఆక్సిజన్ కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం అన్నారు.చిరంజీవి అంటే నాకెంతో అభిమానం అని మంత్రి విశ్వరూప్ అన్నారు.జనసేన నేత నల్లా శ్రీధర్ వారిస్వగృహం  నల్లా సత్యనారాయణ  ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లోపురపాలక చైర్ పర్సన్ రెడ్డి నాగేంద్ర మణీ, ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, డి ఎం ఆర్ శేఖర్ బాబు, వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, మట్టపర్తి నాగేంద్ర, పితాని బాల కృష్ణ, నల్లా చిట్టిబాబు, నల్లా నాయుడు, కౌన్సిలర్లు  గోలకోటివిజయ లక్ష్మి, కొల్లాటి దుర్గా భాయి, గండి దేవి హారిక, పడాల శ్రీదేవి, పిండి సాయి బాబు, సుదా చిన్నా, గుండాబత్తుల తాతాజీ,పడాల నానాజీ, తదితరులు పాల్గొన్నారు.