ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ,మున్సిపల్
వార్డ్ ప్రజలకు ఏ.ఎస్. కే. ఫౌండేషన్ వారు అత్యవసర వైద్య అవసరాల కోసం గర్భిణీ
స్త్రీలకు ఉచిత ఆటో సదుపాయాన్ని
కలిగిస్తున్నారని డి .సి .సి. అధ్యక్షులు సాజిద్ ఖాన్ తెలిపారు . ఈ సందర్భంగా అయన
మాట్లాడుతూ అత్యవసర వైద్యం అవసరం ఉన్నవారు మెడికల్ ల్యాబ్ టెస్ట్ ల కోసం
వెళ్ళ లేని రోగులకోసం ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచు తున్నా మని తెలిపినారు.
ఈ సదుపాయం లాక్ డౌన్ సమయం ముగిసిన
తర్వాత అంటే ఉదయం పది గంటల నుంచి తిరిగి
ఉదయం ఆరు గంటల వరకు ,అత్యవసర సేవలకు అవసరమైన వారికి అందుబాటులో ఉంటుందని
పేర్కొన్నారు. సదుపాయాన్ని పొందటానికి 24 గంటలు పనిచేసే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ,ఈ ఉచిత ఆటో
సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు .మొదట వన్ టౌన్ పరిధిలో 10 ఆటోలు ,టూ టౌన్
పరిధిలో 10 ఆటలతో ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. గర్భిణి
స్త్రీలు, అత్యవసర వైద్య సదుపాయాలు కావలసినవారు ,లాక్ డౌన్
సమయం ముగిసిన తర్వాత ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చు. అవసరమైతే ఇంకా ఎక్కువ ఆటోలతో కూడా ఈ
సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని కరోనా కల్లోల సమయంలో ప్రజల కష్ట
సుఖాల్లో భాగం పంచుకోవడానికి వీలుగా, వారికి
తోడుగా ఉండేందుకు, వారికి ధైర్యాన్ని కల్పించేందుకు, వైద్య సేవ లో
ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఈ సదుపాయాన్ని ప్రజలకు
అందిస్తున్నామని దీన్ని అవసరమున్నవారు 7386468941 నెంబర్ కి ఫోన్ చేసి సద్వినియోగం
చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నగేష్, మల్లేష్
యాదవ్,రాహుల్ చంద్రాల,రాజు యాదవ్,రసూల్ ఖాన్,గయాసొద్దీన్,షేక్ అబ్దుల్
అజిజ్ తదితరులు పాల్గొన్నారు.