ఏపీలో16 చోట్ల హెల్త్ హబ్స్ ఏర్పాటు: ముఖ్యమంత్రి జగన్

 

అమరావతి,(ఆరోగ్యజ్యోతి): ఏపీలో 16 చోట్ల హెల్త్ హలను ఏర్పాటు చేయనున్నట్లు  ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి  చెప్పారు. కరోనాపై సమీక్షించిన ఆయన..13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలలో హెల్త్ హట్లను ఏర్పాటు చేస్తామని,ఒక్కో హెల్త్ హబ్ కోసం 30-50 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ హబ్ లో ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు కేటాయిస్తామని.. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములుకేటాయిస్తామన్నారు.