హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రైవేట్
ఆస్పత్రులు ప్రజలను ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్
మినిస్టర్ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజి అనుబంధ
ఆస్పత్రుల్లో 14 వేలకు పైగా బెడ్స్ ఉన్నాయని, వారందరికీ
ప్రభుత్వమే మందులు అందిస్తుందన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ టీం ఎప్పటికప్పుడు ప్రైవేట్
ఆస్పత్రులను విజిట్ చేసి.. లోపాలు ఉన్న చోట తగు చర్యలు తీసుకుంటామన్నారు.ఆర్టీ-పీసీఆర్
టెస్టుల కోసం కొత్త యంత్రాలు, రీజెంట్
లు కొనాలని సీఎం ఆదేశించినట్టు హెల్త్ మినిస్టర్ చెప్పారు. యాంటీజన్ పరీక్షల్లో 90
శాతానికి పైగా సత్ఫలితాలు ఇస్తోందన్నారు. రాష్ట్రంలో కేసులు ఎక్కువగా వున్నా..
తీవ్రత తక్కువగా వుంటోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో
చర్చలు జరిపినట్టు మంత్రి చెప్పారు.రాష్ట్రంలో కేసులు ఎక్కువగా వున్నా.. తీవ్రత
తక్కువగా వుంటోందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో
చర్చలు జరిపినట్టు మంత్రి చెప్పారు. ఆయా ఆస్పత్రుల వారు సైతం కేసుల పెరుగుదలకు
ప్రజల్లో కరోనా పట్ల సీరియస్ నెస్ తగ్గిందని చెప్పారన్నారు.కరోనా పట్ల నిర్లక్ష్యం
తగదని మంత్రి ఈటల అన్నారు. ఫంక్షన్ లు, బహిరంగ
సభలు, అనవసర
ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ లు ఉండవని మరోసారి మంత్రి సూచించారు. కరోనాతో
జీవించాల్సిందేనని, వైరస్ నుంచి మనల్ని మనం
కాపాడుకోవాలన్నారు.మహారాష్ట్రలో కేసులు పెరగడం, మహారాష్ట్ర తెలంగాణ కు ఉన్న
అవినాభావ సంబంధం వల్ల ఇక్కడా కేసులు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీలో
కేస్ లు పెరగడమే రాష్ట్రంలో కేస్ ల
పెరుగుదలకు కారణమన్నాడు.సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు,
టివివిపి, పిహెచ్
సీలు సహా అన్ని ఆస్పత్రులు కరోన చికిత్సకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు.
కరోనా డెత్ రేట్ మన దగ్గర చాలా తక్కువన్నారు. అన్ని వైద్య సేవలతో పాటు కోవిడ్
సేవలు ఆందిస్తామని ఈటల చెప్పారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులకు
మందులను ప్రభుత్వమే అందిస్తోందన్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఉచితంగా కోవిడ్ చికిత్సలు
అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు పాత జీవో ప్రకారం సర్వీస్ అందివ్వాలని
మంత్రి ఈటల ఆదేశించారు.