కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
- ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ వైరస్ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమావేశాన్ని ఆయన నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెకండ్ సేవ్ ప్రారంభం అయినాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టికా తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు .మాస్కు ధరించి వారి కి ఫైన్ వసూలు చేసే విధంగా గ్రామ పంచాయతీలలో తీర్మానం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో రెవెన్యూ పంచాయతీ పోలీసు శాఖ సహకారంతో కోవిడ్ కట్టడికి చర్యలు చేపట్టాలని అన్నారు. మండల తహసీల్దార్లు మండల పరిషత్ అధికారులు ఆయా మండలాల్లో కరోనా కట్టడి చర్యలు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలతో వెంటనే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాస్కు ధరించి నీ వారి వద్ద నుండి మొదట వంద రూపాయలు రెండోసారి వెయ్యి రూపాయలు ఫైన్ వసూలు చేయాలని తెలిపారు. గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ సమైక్య సంఘాల సహాయకుల సహకారంతో వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రచారం చేయాలన్నారు. ఆయా సబ్ సెంటర్లలో పరిధిలో అర్హులైన వారికిటికా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు .100% వ్యాక్సినేషన్ జరిగేలా ప్రజలు చైతన్యవంతులుగా చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 5 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు రిమ్స్ లో కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ కు కేటాయించిన లక్ష్యాలను చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా రోజుకు 3300 కరోనా పరీక్షలు 4125 తప్పక సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం, ఆర్డిఓ రాజేశ్వర్ ,డి ఈ ఓ రవీందర్ రెడ్డి ,జిల్లా పరిషత్ సీఈవో కిషన్, జిల్లా పౌర సరఫరా అధికారి సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, జిల్లా పౌరసంబంధాల అధికారి కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, పంచాయతీ అధికారి శ్రీనివాస్ ,కలెక్టరేట్ పాలన అధికారి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.