నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన శిరీష ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. తక్కువ బరువుతో ఉండటంతో వీరిని ఇంక్యూబేటర్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈమెకు మొదటి కాన్పు, శస్త్ర చికిత్స ద్వారా ప్రసవించినట్లు పేర్కొన్నారు. తల్లిబిడ్డులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.