జర్నలిస్ట్ కు అండగా ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని

 

విజయవాడ,(ఆరోగ్యజ్యోతి): కరోనాతో బాధ పడుతున్న విజయవాడ ఆంధ్ర ప్రభ జర్నలిస్ట్ సాయి కి ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని,కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ లు అండగా నిలచి సామాజిక సేవలో ముందుంటామని నిరూపించారు.అందుకు తాజా ఉదాహరణ విజయవాడ కు చెందిన ఆంధ్ర ప్రభ జర్నలిస్ట్ సాయి ఇటివల కరోనా సోకి హస్పటల్ లో చేరారు.సహచర జర్నలిస్ట్ లు ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.అప్పుడు తక్షణమే ఆరోగ్య శాఖామంత్రి స్పందించి మెరుగైన చికిత్సను అందించాలని అదేశించారు.అంతటితో తన బాధ్యత తీరింది అనుకోకుండా ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.హస్పటల్ యాజమాన్యాన్ని ఆకుటుంబ సభ్యులపై ఓత్తిడి తీసుకురావద్దని ఆదేశించించి ఆయన ప్రజల మంత్రని చాటుకున్నారు.ఆయన స్పందన పట్ల జర్నలిస్ట్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆ కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.