కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451
-
జిల్లా న్యాయ
సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వి. మహేష్
నాథ్
photo-3
వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ,వరంగల్ అర్బన్ జిల్లా
వైద్యాధికారి వారు సంయుక్తంగా "న్యాయ
విజ్ఞాన సదస్సు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ" అంశాలపై లష్కర్ సింగారం జిల్లా న్యాయ
సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వి. మహేష్
నాథ్ పాల్గొని, మాట్లాడుతూ
"ప్రపంచంలో ఎన్నో రకాల కొత్త వ్యాధులు వస్తూనే ఉన్నాయి, దానికి తగ్గట్లు వైద్యరంగం కూడా పూర్తి
స్థాయిలో అభివృద్ధి చెందుతూదన్నారు. వ్యాధికి తగిన మందులు, చికిత్సలు అందుబాటులోనే ఉన్నాయని అయన ఈ
సందర్భంగా తెలిపినారు. కోవిడ్-19 పట్ల పూర్తి
జాగ్రత్తతో మెలగాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న ప్పటికీ మాస్క్
తప్పనిసరిగా వాడాలి అన్నారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల పుకార్లను నమ్మకూడదని ఈ
సందర్భంగా తెలియజేశారు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలగు లక్షణాలు కలిగినప్పుడు వెంటనే వైద్యులను
సంప్రదించి, వైద్యుల సలహాలు
తీసుకోవాలని తెలిపినారు. ఆరోగ్యంగా ఉండడం ప్రతి ఒక్కరి హక్కు అని ఈ సందర్భంగా
తెలియజేశారు. కనుక ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా ఆరోగ్య చికిత్సలు చేయించుకోవాలి.
ఎటువంటి లక్షణాలు కనబడిననూ వెంటనే వైద్య చికిత్సలు చేసుకోవాలని తెలియజేశారు. .
ఏదైనా వ్యాధి ప్రాణాలమీదికి వచ్చేంతవరకు చూడకుండా, వైద్యుల సలహా లను, సూచనలను పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా
కోవిడ్ 19 పరీక్షలను మరియు
కోవిడ్ 19 వ్యాక్సినేషన్
పద్ధతులను క్షుణ్నంగా పరిశీలించారు.ఈ అవగాహన సదస్సులో వరంగల్ అర్బన్ జిల్లా అదనపు
వైద్య శాఖ అధికారి డాక్టర్ టీ. మదన్మోహన్రావు మాట్లాడుతూ, కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు, టీబీ, క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల నివేదికను సంక్షిప్తంగా వివరించడం జరిగింది. ఈ
సదస్సులో డాక్టర్ పి.ఎస్. మల్లికార్జున్,వి. అశోక్ రెడ్డి(డి.ఈ.ఎమ్.ఓ.),
డాక్టర్ వివేక్- జనరల్
ఫిజిసియన్, డాక్టర్ రవళి,
డాక్టర్ అర్చన, చంద్రశేఖర్- హెచ్.ఈ.ఈ.ఓ., శ్రీనివాస్, సురేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.