కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
పదకొండవ పిఆర్సి కమిటీ సిఫారసు ప్రకారం వేతనాలను
వర్తింపచేయాలి
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పదకొండవ పిఆర్సి కమిటీ సిఫారసు చేసిన ప్రకారం
వేతనాలను వర్తింపచేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్
జిల్లా అధ్యక్షులు సురేందర్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, సిఐటియు జిల్లా
కార్యదర్శి బి ఆశన్న, ఉపాధ్యక్షులు అక్రం ఖాన్ లు డిమాండ్ చేశారు. గురువారం నాడు జిల్లా వైద్య
ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర
వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువశాతం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో
ఉద్యోగులు పనిచేస్తున్నారని, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు
పనిచేస్తున్న విషయం మాత్రం వ్యత్యాసంగా ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం
చెల్లించాలి ఉండగా కేవలం అరకొర వేతనాలు చెల్లిస్తూ ఉన్నారని తెలిపారు కరోన కాలంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
విధులు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ లోని అన్ని విభాగాల్లో
ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి కమిషన్ సిఫారసు ప్రకారం
వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఎంహెచ్ఎం
లోని 510 జీవో అమలు కాని ఉద్యోగులందరికీ పదకొండవ పిఆర్సి ప్రకారం వేతనాలు
చెల్లించాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎం, ఇ సి ఏఎన్ఎం, 104,108,102, ఉద్యోగులతో పాటు వైద్య కళాశాలలో
పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పిఆర్సి వర్తింప చేయాలన్నారు. పదకొండవ పిఆర్సి కమిషన్
సిఫారసు ప్రకారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ భర్తీ చేయాలని వారు
డిమాండ్ చేశారు.