కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి.

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

-          జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.   

  నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారం లక్ష్మణ చందా, ఖానాపూర్, కడెం ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. వృద్దులకు అపోహలు వీడి అందరు టీకా వేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. గ్రామాల వారిగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు టీకా వేసుకునేలా డాక్టర్లు, వైద్యసిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామం నుండి రోజుకు 250 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించేలా గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో కోవిడ్ నిబంధనలు పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మెన్ రాజేందర్, డాక్టర్లు శ్రీకాంత్, నాగేశ్వర్ రావు, ఎంపిడిఓలు, మోహన్, మల్లేశం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.