పాత బకాయిలను వెంటనే మాఫీ చేయాలి.
-మండల కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి వేపూరీ సుధీర్ .
నడిగూడెం,(ఆరోగ్య జ్యోతి) : ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీల పాత విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి అనిమండల కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి వేపూరీ సుధీర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడుతూ...గడిచిన ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల పాత విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దళితులకు గిరిజనులకు బీసీ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఉన్నా కుటుంబాలపై ఎప్పుడో తాతల కాలంలో ఉన్న బకాయిలను కడతారా లేకపోతే విద్యుత్ తొలగిస్తామని బెదిరించడం సబబుకాదని, వేలకోట్ల రూపాయలు ధనికులకు మాపి చేస్తున్నపుడు పేద కుటుంబాల వారికి పాత విద్యుత్ భాగాలు ఎందుకు మాఫీ చేయారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? గత ప్రభుత్వం లాగానే వంద యూనిట్లలోపు ఉచితంగా అందించాలని దౌర్జన్యంగా విద్యుత్ అధికారులు దాడులు చేసి వారి వారిపై కేసులు బనాయిస్తే సహించేది లేదని వెంటనే పాత బాకీలను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో అందరితో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గోపాలపురం ఉపసర్పంచ్ లావురి శ్రీను వెంకన్న నాగేశ్వర్రావు రాముడు లక్ష్మణ్ సైదులు మారి బాబు శేఖర్ ప్రసాద్ గోవిందు శ్రీకాంత్ సైదమ్మ సుశీల శ్రీను విజయ్ మహేష్ మధు భాను రోబో విజయ్ రాజా వంశీ శ్రీరామ్ సాయి గణేష్ సురేష్ మహేష్ నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు.