ప్రతి పోలీస్ అధికారి వ్యాక్సిన్ వేయించుకోవాలి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

-వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి

 వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే ప్రతి పోలీస్ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీసులకు పిలుపునిచ్చారు. కోవిడ్ నియంత్రణలో ఫ్రంట్ వారియర్స్ గా వున్న పోలీసులకు గతంలో ఆయా పోలీస్ స్టేషన్ల సమీప ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగేది. రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునందుకోని వరంగల్ పోలీస్ కమినరేట్ పరిధిలో పోలీసు అధికారులతో పాటు హోంగార్డ్స్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నూతనంగా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ కార్యాలయములో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. ముఖ్యంగా ఈ కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న తీరుతెన్నులపై కమిషనర్ సంబంధిత పోలీసు మరియు వైద్య అధికారులు అడిగి తెలుసుకోవడంతో పాటు, కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై సంబంధిత పోలీసు అధికారులు ఆరా తీసి వ్యాక్సిన్ తీసుకోని సిబ్బందికి తక్షణమే వ్యాక్సిన్ వేయించాలని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించే సమయంలో అధికారులు అనారోగ్య సమస్యలతో బాధపడే సిబ్బందికి సంబంధించి డాక్టర్ల సలహాలను తీసుకోని వ్యాక్సిన్ పంపిణీ చేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న విజీ ప్రమోద్ కుమార్ మరియు అధికారులు వరంగల్ రెంజ్ ఐజీ ప్రమోద్ కుమార్ తో పాటు ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మితో పాటు, ఆదనపు డిసిపి జనార్దన్, ఎ.సి.పిలు ఆర్.ఐలు సైతం వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రంలో కరోనా తొలిదశ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమములో ఈస్ట్ జోన్,సెంట్రల్ జోన్ డి.సి.పిలు వెంకటలక్ష్మీ పుష్పా, అదనపు డి.సి.పిలు జనార్దన్, భీంరావు, ఎ.సి.పిలు శ్రీనివాస్, నాగయ్య, సదానందం, సురేందర్, ఆర్.ఐలు భాస్కర్, శ్రీనివాస్, హతీరాం కమిషనరేట్ కార్యాలయ డాక్టర్ విజయ్ కుమార్ తో పాటు ఇతర పోలీసు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు