కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
డయేరియా బాధితుల్లో 20 మంది చిన్నారులు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా సిరికోండ మండలం తుమ్మల్‌పాడ్ గ్రామంలో డయేరియా
ప్రబలింది. గ్రామంలో ఇప్పటి వరకు 50
మంది డయేరియా బారిన పడ్డారు. అందులో 20
మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అస్వస్థతకు
గురైయ్యారు. మరి కొందరు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది
పడుతున్నారు. గ్రామంలో చాలా మంది నీరసంతో మంచం పడుతున్నారు. గ్రామంలో వెంటనే వైద్య
శిబిరాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.