జిల్లాలోని 23 ఆరోగ్య కేంద్రాలలో మరియు 3 ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్

 - జిల్లా వైధ్యాధికారి  డాక్టర్ధ ధన్ రాజ్ 

నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలోని 23 ఆరోగ్య కేంద్రాలలో మరియు 3 ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని   జిల్లా వైధ్యాధికారి ధన్ రాజ్ అన్నారు.  వాక్సినేషన్ తీసుకొని హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ వర్కర్స్ ని కూడా ఈరోజు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.అదేవిధంగా  45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న వారికి దాదాపు 5435 మందికి, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన 3404మందికి ఈరోజు వాక్సినేషన్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.వాక్సిన్ యొక్క  ఆవశ్యకత పైన మరియు దాని యొక్క ప్రాధాన్యత పైన దాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజల్లో  విస్తృతంగా అవగాహన కల్పించడం మూలంగా గత నాలుగు రోజుల నుంచి వ్యాక్సినేషన్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.  ఇప్పటి వరకూ 45 నుండి 59 సంవత్సరాల వారికి 18235 మందికి ,60 సంవత్సరాలపై బడిన 14502 మందికి ,  ,హెల్త్ వర్కర్స్ ,ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి కలిపి 39670 మందికి మన జిల్లాలో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లాలో అర్హులైన వారందరికీ టీకాలు ఇచ్చేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.   జిల్లాలో ఉన్న మొత్తం అర్హులైన అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారి యొక్క మార్గదర్శనంలో వారి యొక్క సలహాలు సూచనల మేరకు జిల్లా కార్యక్రమాన్నిమరింత ముందుకు తీసుకెళ్ళి వంద శాతం లక్ష్యాన్ని సాధిస్తాం.