కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
సూర్యాపేట,(ఆరోగ్యజ్యోతి): అంజన పూరి కాలనీ లోని కొవిడ్ నిర్ధారణ
శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ
అధికారి డాక్టర్ కోటా చలం పరిశీలించారు. ఈ
సందర్భంగా అయన మాట్లాడుతూ మొత్తం 298 గృహాలను సర్వే చేయగా, 25 టీమ్ ల ఆధ్వర్యంలో 33 పరీక్ష నిర్వహించినట్లు తెలిపినారు. ఈ కాలనీలో
ప్రస్తుతం ఎనిమిది యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ
మాస్కు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, చేతుల పరిశుభ్రత పాటించాలని ,
45 సంవత్సరాలు నిండిన
ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తప్పని సరిగా వేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కోవిడ్
వ్యాక్సిన్ కి సంబంధించిన వదంతులు నమ్మరాదని, ఎవరికైనా అత్యవసర
వైద్య సహాయం కావలసి వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని, కోవిడ్ టీకాల పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని, సురక్షితమైన టీకాను ప్రతి ఒక్కరూ వేసుకొని
కరోనా వ్యాధి నుంచి రక్షించుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి
డాక్టర్ కోటా చలం అన్నారు. వీరితో పాటుగా
డాక్టర్ హర్షవర్ధన్ , డాక్టర్ వినయ్, డిస్టిక్
ప్రోగ్రాం మేనేజర్ బాస్కర్ రాజు,
సి హెచ్ వో యాదగిరి, సతీష్, ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.